Our Vision.
చరిత్ర చెరిపితె చెరిగేది కాదు.
"సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోనంత వరకు, రాసుకోలేనంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది.మన కథ మనం , మన జీవితాలు మనం ఆవిష్కరించనంత కాలం పక్కవాడు చెప్పిందే నిజం అవుతుంది".
2012 సంవత్సరం లో జరిగిన నూతన అధ్యాపకుల నియామకాల ద్వారా సంఘాల మనస్తత్వం, నాయకులలో ఆలోచన విధానం తేట తెల్లం అయింది. వ్యవస్థలోనీ నాయకుల అస్తవ్యస్తమైన ధోరణులతో , పలుకుబడితో , బెదిరింపులతో చలామణి అవుతూ గడిపిన కాలం, దాని రూపం "Last come - First go" ప్రొసీడింగ్. నాయకుడు అనేవాడు త్యాగనిరతికి ప్రతిరూపం అవ్వాలి కానీ, తనను నమ్ముకున్న వాళ్ళని వంచించకూడదు.ఆ సమయంలో జూనియర్స్ మాట వినే నాదుడు లేడు. మోసపోయిన జూనియర్స్ పక్షాన నిలబడ్డ వాళ్ళు లేక నిస్సహాయ స్థితిలో ఆక్రోశం, ఆవేదన నిస్సహాయతలో చెల్లచెదురు అయిన జూనియర్స్ కోర్టును ఆశ్రయించి "Last come, First go " ను మరియు అప్పుడు వున్న వ్యవస్థకు ఎదురు నిలిచి, తిరిగి వ్యవస్థలో అధ్యాపకులుగా నియామకం పొందారు. ఇప్పటికి ఆ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ లోనే ఉంది.అది ఒక గొప్ప విజయం. ఈ విజయం జూనియర్స్ అందరిది. వ్యవస్థలో రెండు నెలల కాలం బయట ఉండుటకు మనస్సు అంగీకరించని మన నాయకులు రేపటి భవిష్యత్తులో మనవైపు నిలబడతారనేది కలగా భావించి తమలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని మేథోమదనం చేసి ఒక న్యాయమైన అంశం ఆధారంగా ఏర్పడ్డ సంఘం "TRAGCJLA-508". ఈ ఏర్పడ్డ సంవత్సరములో ప్రతి జిల్లా నుండి భారీగా చేరికలు జరగాయి. దీనిని గమనించిన మిగతా సంఘాలు జూనియర్స్ ని బుజ్జగించి , వీలైతే బ్రతిమాలి, కాక పోతే బెదిరించి సంఘాన్ని విచ్ఛిన్నం చేయదలిచారు.అన్ని సంఘాలలో ఉన్న జూనియర్ల ప్రాముఖ్యత 508 సంఘం ఆవిర్భావానికి ముందు తరువాత అన్నది నిస్సందేహంగా పెరిగింది.ఎందుకంటే కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకం 2007 నుండి మొదలు కొని సుమారు 2012 వరకు అధికం. RJD appointed వారందరూ ఏకం అయితే మిగిలిన సంఘాల ఉనికి ప్రశ్నార్థకం అందుకే జిల్లా , రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులను జూనియర్స్ కి ఇచ్చారు. RJD సంఘం ఎన్నో అవమానాలు అయిన భరిస్తూ, సమస్య సరైనది అయినప్పుడు అందరితో కలిసి పనిచేసింది. విధానం తప్పుగా వున్నప్పుడు మొహమాటం లేకుండా బహిరంగంగానే విమర్శించాం. కొన్ని సందర్భాలలో ,కొన్ని జిల్లాలో మౌనాన్ని పాటించాం. సంఘం దృఢమైన మనస్తత్వం , లక్ష్యం పట్ల వున్న ఏకాగ్రత గల నాయకత్వంతో ముందుకు ప్రయాణం సాగింది. రెగ్యులరైజేషన్ ప్రక్రియలో జరిగిన ఆలస్య సమయంలో అందరినీ ఒకే వేదికపైకి తీసుకరావడానికి వివిధ రకాలుగా ప్రయత్నించాం కానీ సాధ్యం కాలేదు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కోసం మరియు వ్యవస్థ ప్రయోజనాల కొరకు పరిగెత్తడమే కాకుండా మిగతా సంఘాలను ఉరకలు వేయించిన పని తీరు మన సొంతం. రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మనల్ని పబ్లిక్ డోమైన్ లో పెట్టి బజారున పెట్టిన సందర్బంలో కమిషనరేట్ నుండి SCERT కి మర్పించి దళారుల చెరనుండి పారదర్శకతతో రెగ్యులరైజేషన్ పూర్తి చేసారు. పల్లా గారితో రివ్యూ మీటింగ్ పెట్టించిన ఘనత 508 కే చెందుతుంది. నియామక ఉత్తర్వులు ఆలస్యంను సాకుగా చూపి అవాక్కులు చవాక్కులు , నిందలు ప్రచారం చేస్తూ అధ్యాపకులలో నిరుత్సాహం నింపారు. కానీ, గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దేశం అంత చూస్తుండగా డా.బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయ ప్రారంభోత్సవం సందర్బంగా మన నియామక ఉత్తర్వులు విడుదల చేసి మనకు తన హృదయంలో ఉన్న స్థానాన్ని ప్రకటించారు. మన నియామక ఉత్తర్వుల విడుదలలో మన సారూ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి పాత్ర ఏంతో కీలకం మరియు మరువలేనిది. రెగ్యులరైజేషన్ పూర్తి అయిన తరువాత కూడా అన్ని సంఘాలు ఒక్కటిగా కలిసిపోవడంకోసం ప్రయత్నాలు చేశాం కానీ ఫలితం రాలేదు. కాబట్టి , మన అస్థిత్వం, ఆత్మగౌరవం రేపటి మన హక్కుల సాధనలో గౌరవ పెద్దల ఆశీస్సులతో ముందుకెళ్లాలనే ఏకైక సంకల్పంతో మన సంఘం ఏర్పాటు కోసం చేసిన ఆలోచనల ప్రతిరూపమే మన ఈ నూతన సంఘం ఏర్పాటు అదే మన "TELANGANA GOVERNMENT LECTURERS ASSOCIATION" (TGLA).
అన్న మాట ప్రకారం మనల్ని రెగ్యులరైజేషన్ చేసిన మన కలియుగ దైవం "KCR" .వారి నినాదమే మన నినాదం అది "Live-let Live" (బ్రతుకు,బ్రతికించు). చిత్త శుద్ధితో విధులను నిర్వహిస్తే , హక్కులు వాటంతట అవే వస్తాయి(Duties first,Rights follow). చేసే పనిలో నిబద్ధత, అకుంటిత దీక్ష మన సొంతం. KCR ఇచ్చిన ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని, అనునిత్యం ప్రభుత్వ విద్య పురోగతికి, బడుగు బలహీన వర్గాల విద్యార్థినీ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మార్గాలను చూపుతూ, బంగారు తెలంగాణా ఆవిష్కరణలో మన పాత్రను సముచితంగా , గొప్పగా వుండేలా ముందుకు అడుగులు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
- మిగిలిన కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణ మన ముందున్న తక్షణ కర్తవ్యం.
- అవకాశం ఉన్నా 15 సం. ఒకే కళాశాలలో ఉన్న వారికీ & మల్టి జోనల్ స్థాయి బదిలీలు.
- మన హక్కుల సాధన, ఇంటర్ వ్యవస్థ పరిరక్షణ.
- కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచెస్తూ అమరులైన కుటుంబాలకు చేయూత.
- మన సంఘం ఆధ్వర్యంలో మన విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి.
- సామాజిక సేవ & విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు.
- సంఘం బలోపేతం & ఆర్థిక స్థిరత్వం కోసం కృషి.
